తాజా వార్తలు   టీడీపీ నేత పట్టాభికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు | భీమవరం,పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాలలో | భీమవరంలో డ్వాక్రా మహిళలకు మహిళా సాధికారత ఫై సదస్సు | రఘురామాఫై విజయసాయి పిర్యాదుకు RBI స్వాందన.. | ఏపీ సిఎం ను బూతులు తిడతమేమిటి? కేటీఆర్ ఆగ్రహం | రాధేశ్యామ్‌..టీజర్ విడుదల..భీమవరంలో ప్రభాస్ పుట్టిన రోజు హంగామా | ప్రపంచం చుసేవిధముగా బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ | భీమవరం, 2వ రోజు జనాగ్రహదీక్షలో గ్రంధి సంచలన వ్యాఖ్యలు | 100 కోట్ల వ్యాక్సిన్ల పంపిణీ భారతీయ విజయం..మోడీ | 2 వ రోజు దీక్షలో చంద్రబాబు..హెచ్చరికలు,విశేషాలు |

గణేష్‌ విగ్రహాల నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

Updated: September 16, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: హైదరాబాద్ హుస్సేన్‌ సాగర్‌లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనానికి  దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం, ప్రజలలో భక్తి  ఆసక్తి ముడిపడి ఉన్నాయి. ఇక ఏడాది నిమజ్జనానికి అన్ని విఘ్నలు  తొలిగాయి. ఈ ఏడాది  ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) వినాయక విగ్రహాల నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇదే చివరి అవకాశం అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. వినాయక విగ్రహాల నిమజ్జనం పిటిషన్‌పై నేడు, గురువారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిమజ్జనం అంశానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. జీహెచ్‌ఎంసీ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.ఇప్పటికే హుస్సేన్ సాగర్ చుట్టూ క్రేన్‌లు ఏర్పాటు చేశామని కాలుష్యం జరగకుండా వెంట వెంటనే విగ్రహాలను తరలిస్తామని సోలిసిటర్ జనరల్ వివరించారు.హైదరాబాద్‌ వినాయక నిమజ్జనం ఇబ్బందులు తనకు తెలుసు అని సీఐజే అన్నారు. 
 
 
 

Related Stories