తాజా వార్తలు   టీడీపీ నేత పట్టాభికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు | భీమవరం,పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాలలో | భీమవరంలో డ్వాక్రా మహిళలకు మహిళా సాధికారత ఫై సదస్సు | రఘురామాఫై విజయసాయి పిర్యాదుకు RBI స్వాందన.. | ఏపీ సిఎం ను బూతులు తిడతమేమిటి? కేటీఆర్ ఆగ్రహం | రాధేశ్యామ్‌..టీజర్ విడుదల..భీమవరంలో ప్రభాస్ పుట్టిన రోజు హంగామా | ప్రపంచం చుసేవిధముగా బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ | భీమవరం, 2వ రోజు జనాగ్రహదీక్షలో గ్రంధి సంచలన వ్యాఖ్యలు | 100 కోట్ల వ్యాక్సిన్ల పంపిణీ భారతీయ విజయం..మోడీ | 2 వ రోజు దీక్షలో చంద్రబాబు..హెచ్చరికలు,విశేషాలు |

భీమవరంలో ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం

Updated: September 16, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్ : భీమవరం లో స్థానిక సిఎస్ఎన్ కళాశాలలో అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. భూమి మీద కాలుష్యంతో ఇప్పటికే  ఓజోన్ పొర దెబ్బతిని వాతావరణం అస్తవ్యస్తంగా ఉందని, ప్రజా ఆరోగ్యం దెబ్బ తింటుందని .. ఓజోన్ పొర రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సిఎస్ఎన్ కళాశాల వ్యవస్థాపకులు డాక్టర్ చీడే సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ వాయు కాలుష్యం, నీటి కాలుష్యము కాకుండా ఏసిలు, పరిశ్రమల ద్వారా వచ్చే దూమం అన్ని అరికట్టాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ సకుమళ్ళ సత్యనారయణ, విజ్ణాన వేదిక  చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ పర్యావరణ మార్పులపై, ఓజోన్ పొర క్షీణతపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించి, గొడుగులు, గ్లోబ్ లతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు నరహరిశెట్టి కృష్ణ, పర్యవరణ శాస్త్రవేత్త మట్లపూడి సత్యనారయణ, బొమ్మదేవర ప్రభాకర్, గెడ్డం భాస్కరరావు విద్యార్థులు పాల్గొన్నారు.

 
 

Related Stories