తాజా వార్తలు   సీఎం జగన్ పాలన నిర్ణయాలు భేష్..కేంద్ర మంత్రి | ఉల్లి ధర చూస్తుండగానే 1 కేజీ రూ.100కు.. | మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత | హీరో రాజశేఖర్ ఆరోగ్యంపై ఆందోళన..చిరంజీవి స్వాందన | భీమవరంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ లో.. | విక్టరీ వెంకటేష్ F2 కు ఇండియన్‌ పనోరమ అవార్డు | విజయవాడ దుర్గమ్మకు సీఎం జగన్ పట్టువస్త్రాలు | ఏపీలో40 శాతం లిక్కర్ వినియోగం,18 శాతం నేరాలు తగ్గాయి. | వైఎస్సార్‌ బీమా పధకం ప్రారంభం..బీమా ప్రయోజనాలు | తుంగభద్ర పుష్కరాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం |

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దసరా ఉత్సవాల పోస్టర్ విడుదల

Updated: October 11, 2020

సిగ్మా తెలుగు డాట్ కామ్, న్యూస్: ఉభయ తెలుగురాష్ట్రాలలో తన భక్తులకు బంగారు తల్లిగా ప్రసిద్ధి పొందిన భీమవరం పురాధీశ్వరి శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను ఈనెల 17 నుంచి 25 వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో దసరా మహోత్సవ వేడుకలు పాస్టర్ ను నేడు ఆదివారం ఏంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్ ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేస్తారని, భక్తులకు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలని అన్నారు.17న బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ, 18 న అన్నపూర్ణాదేవి, 19 న గాయిత్రి దేవి, 20 న మహాలక్ష్మి దేవి, 21 న సరస్వతి దేవి, 22న లలిత త్రిపుర సుందరి దేవి, 23న దుర్గాదేవి, 24న మహిషా సురమర్ధిని దేవి, 25న రాజరాజేశ్వరీ దేవి అలంకరణ చేస్తామని ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. అదే విధంగా ఆలయ ప్రాంగణంలో చండి హోమం, లక్ష కుంకుమార్చన నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ తిరుమని ఏడుకొండలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
 
 

Related Stories