సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: భీమవరం పట్టణంలో దీపావళి సంబరాలు మరో 5 రోజులలో ప్రారంభం అవుతున్న సందర్భముగా ఎప్పటిలాగే స్థానిక లూథరన్ హైస్కూల్ గ్రౌండ్ లో బాణాసంచా వ్యాపారాలు షాపులు ప్రారంభించారు. అయితే కరోనా ప్రభావంతో ఈసారి కాస్త ఆలస్యంగా తక్కువ సంఖ్యలో షాపులు ప్రారంభిస్తున్నారు.దశాబ్దాలుగా బాణాసంచా వ్యాపారంలో అన్ని వైరైటీలతో, అతి నాణ్యమైన ఒరిజినల్ బ్రాండెడ్ సరుకు హోల్ సేల్ ధరలకు అమ్మే షాప్ గా పేరున్న ''వరుణా సూపర్ బజార్' వారి బాణాసంచా షాప్ ను ( షాప్ నెంబర్. 6 )నేడు, సోమవారం, ప్రముఖులు మెంటే పార్ధ సారధి ప్రారంభించారు.ఆయనతో పాటు నల్లం వీరాస్వామి, జి కృష్ణ, సత్యనారాయణ తదితరులు పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు. మెంటే పార్ధ సారధి, భీమవరం ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ..కోవిద్ జాగ్రత్తలతో సురక్షితంగా దీపావళి జరుపుకోవాలని కోరుతూ,వరుణా సూపర్ బజార్ వారి బాణసంచా షాప్ నిర్వాహకులకు శుభాభినందనలు తెలిపారు.