తాజా వార్తలు   టీడీపీ నేత పట్టాభికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు | భీమవరం,పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాలలో | భీమవరంలో డ్వాక్రా మహిళలకు మహిళా సాధికారత ఫై సదస్సు | రఘురామాఫై విజయసాయి పిర్యాదుకు RBI స్వాందన.. | ఏపీ సిఎం ను బూతులు తిడతమేమిటి? కేటీఆర్ ఆగ్రహం | రాధేశ్యామ్‌..టీజర్ విడుదల..భీమవరంలో ప్రభాస్ పుట్టిన రోజు హంగామా | ప్రపంచం చుసేవిధముగా బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ | భీమవరం, 2వ రోజు జనాగ్రహదీక్షలో గ్రంధి సంచలన వ్యాఖ్యలు | 100 కోట్ల వ్యాక్సిన్ల పంపిణీ భారతీయ విజయం..మోడీ | 2 వ రోజు దీక్షలో చంద్రబాబు..హెచ్చరికలు,విశేషాలు |

బాలయ్య, బోయపాటిల ..అఖండ ..టీజర్ అదుర్స్

Updated: April 15, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్:  సింహా,లెజెండ్‌ చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూడో చిత్రం(బీబీ3) ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి  హ్యాట్రిక్ విజయం సాదిస్తుందనే భారీ అంచనాలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌గ్యా జైస్వాల్ క‌థానాయిక‌గా నటిస్తుండగా.. పూర్ణ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా టైటిల్‌ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా నేడు,  ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ చిత్రానికి ‘అఖండ’అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు చిత్రయూనిట్‌ వెల్లడించింది. దీంతో పాటు టీజర్‌ని కూడా విడుదల చేశారు. గత సినిమాల మాదిరే సినిమా టైటిల్‌తో పాటు టీజర్‌ కూడా బాలయ్య స్వామిజిగా త్రిసూలం పట్టుకొని రౌద్ర రుపంలో కనపడుతూ . 'కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది... కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది...' అంటూ పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటోంది. తమన్‌ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ అదిరిపోయింది. బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ విలన్‌గా కనిపించనున్నాడు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా  మే 28న రిలీజ్ కానుంది. 

 
 

Related Stories