తాజా వార్తలు   టీడీపీ నేత పట్టాభికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు | భీమవరం,పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాలలో | భీమవరంలో డ్వాక్రా మహిళలకు మహిళా సాధికారత ఫై సదస్సు | రఘురామాఫై విజయసాయి పిర్యాదుకు RBI స్వాందన.. | ఏపీ సిఎం ను బూతులు తిడతమేమిటి? కేటీఆర్ ఆగ్రహం | రాధేశ్యామ్‌..టీజర్ విడుదల..భీమవరంలో ప్రభాస్ పుట్టిన రోజు హంగామా | ప్రపంచం చుసేవిధముగా బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ | భీమవరం, 2వ రోజు జనాగ్రహదీక్షలో గ్రంధి సంచలన వ్యాఖ్యలు | 100 కోట్ల వ్యాక్సిన్ల పంపిణీ భారతీయ విజయం..మోడీ | 2 వ రోజు దీక్షలో చంద్రబాబు..హెచ్చరికలు,విశేషాలు |

రజనితో మూడోసారి హోరాహోరీగా జగపతి బాబు

Updated: April 27, 2021

సిగ్మా తెలుగు డాట్ కామ్, న్యూస్:  తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తమిళ, తెలుగులో నిర్మిస్తున్న లేటెస్ట్ సినిమా అన్నాత్తే... కీర్తి సురేష్, నయనతార, ఖుష్భూ, మీనా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తెలుగులో గోపీచంద్ హీరోగా  2హిట్ చిత్రాలు మరియు తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కి వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన శివ ఈ సినిమా కు దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరిగిన అన్నాత్తే.. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ సాగుతునట్టు సమాచారం. కాగా ఈ సినిమాలో జగపతి బాబు  కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో జగ్గుభాయ్ తాజాగా ఇన్స్టాగ్రాంలో మేకోవర్‌కి రెడీ అవుతున్న వీడియోను షేర్ చేస్తూ తెలిపాడు. కాగా ఇంతక ముందు సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి జగపతి బాబు కథానాయకుడు, లింగ సినిమాలు చేశాడు.

 
 

Related Stories