తాజా వార్తలు   టీడీపీ నేత పట్టాభికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు | భీమవరం,పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాలలో | భీమవరంలో డ్వాక్రా మహిళలకు మహిళా సాధికారత ఫై సదస్సు | రఘురామాఫై విజయసాయి పిర్యాదుకు RBI స్వాందన.. | ఏపీ సిఎం ను బూతులు తిడతమేమిటి? కేటీఆర్ ఆగ్రహం | రాధేశ్యామ్‌..టీజర్ విడుదల..భీమవరంలో ప్రభాస్ పుట్టిన రోజు హంగామా | ప్రపంచం చుసేవిధముగా బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ | భీమవరం, 2వ రోజు జనాగ్రహదీక్షలో గ్రంధి సంచలన వ్యాఖ్యలు | 100 కోట్ల వ్యాక్సిన్ల పంపిణీ భారతీయ విజయం..మోడీ | 2 వ రోజు దీక్షలో చంద్రబాబు..హెచ్చరికలు,విశేషాలు |

స్వయం భు: కాళ్ళకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి

Updated: June 1, 2020

సిగ్మాతెలుగు డాట్ కం, న్యూస్:( భీమవరం దేవుళ్ళు  ఆర్టికల్) పచ్చని పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుమారు  450 సంవత్సరాల స్వయం భువుడు గా వెలసిన ప్రాంతం భీమవరం పట్టణానికి కేవలం 11 కిమీ దూరంలో కాళ్ళ మండలం లో ఉన్న కాళ్ళకూరు గ్రామం. జిల్లా లో శ్రీ వేంకటేశ్వరుడు ద్వారకా తిరుమల లో స్వయం భువుడుగా  చిన వెంకన్నగా ప్రసిద్ధి  పొందిన నేపథ్యంలో జిల్లా లో అంతటి ప్రాముఖ్యత ఉన్న భక్తుల కోరిన కోర్కెలు తీర్చే పరంధాముడు గా శ్రీ వేంకటేశ్వరుడు కాళ్ళకూరు లో కూడా కొలువై ఉన్నాడు.  ఇక్కడి వెంకన్న కు పురాణ గాధ ఉంది. దాని ప్రకారం  పూర్వము, ప్రస్తుత  తిరుమల తిరుపతి వద్ద వెంకటాచలం కోండపై శ్రీధరుడు  అనే బ్రాహ్మణుడు ఆశ్రమం నిర్మించుకొని శ్రీ వేంకటేశ్వరుని సేవించేవాడని, అదే కోండపై పద్మావతి  అనే గంధర్వ కన్య కూడా స్వామివారి సన్నిధిలో వీణగానం చేసేదని , ఈ నేపథ్యంలో శ్రీధరుడు ఆమెపై మోహము పెంచుకొని ఆమెను స్వయంగా తనను వివాహమాడమనీ కోరగా, ఆమె అతని ప్రతిపాదన తిరస్కరించడంతో .. శ్రీధరుడు కోపంతో స్వామివారి సేవకు పద్మావతి దూరం కావాలని  శపించగా, పద్మావతి కూడా శ్రీధరుడికి అదే శాపాన్ని ఇచ్చింది. తదుపరి ఇరువురు భక్తులు పశ్చత్తాపపడి తిరుమల శ్రీ వేంకటేశ్వరుని  వేడుకోగా.. ఆయన కరుణతో వారికీ మరు జన్మలో మీకు  శాపవిమోచనం కలుగుతుందని, అప్పుడు తిరిగి తనను సేవించుకోవచ్చునని వరం అనుగ్రహించారు. ఆ ప్రభావంతో శ్రీధరుడు కర్ణాటక రాష్ట్రంలో జన్మించి ఎన్నో కష్టాలు పడి, మరు జన్మ లో పద్మావతి నదిగా ఇప్పటి పశ్చిమగోదావరి జిల్లా లో సముద్ర తీరానికి దగ్గరగా అవతరించింది. విధివశాతూ శ్రీధరుడు కూడా పద్మావతి నది వద్దకు చేరుకొన్నాడు, అప్పుడు శ్రీనివాసుడు అతనికి కలలో  కనిపించి నదికి పడమర వైపు అశ్వర్ధ వృక్షం లో తాను వెలసి ఉన్న తన స్వయం భూ  విగ్రహాన్ని తీసి నదికి తూర్పు వైపున ప్రతిష్టించి గుడి నిర్మించి ఆరాధించామని ఆదేశించగా, శ్రీధరుడు  ఆపని చేయగానే అతని తో  పాటు నది రూపంలో ఉన్న పద్మావతికి శాపవిమోచనం కలిగింది. అయితే శ్రీధరుడు ప్రతిష్టించిన  స్వయంభువుడు విగ్రహం నడుము భాగం భక్తులకు దర్శనమిస్తూ క్రింది కాళ్ళ భాగం భూమిలోనే ఉండిపోవడంతో స్వామి వెలసిన ఈ ప్రాంతానికి కాళ్ళ కూరు  అనే పేరు స్థిరపడిపోయింది అని పెద్దలు చెబుతారు. అప్పట్లో ఇక్కడికి సమీపంలోని మొగల్తూరు గ్రామాన్ని అప్పట్లో ' కేతలి పురం' అనే రాజ్యముగా పిలిచేవారని, ఆ రాజ్యాన్ని పాలించే రాజు  రంగరాజు ప్రభువులు , శ్రీ వేంకటేశ్వరుని మహిమతో ప్రస్తుత ఆలయ అభివృద్ధికి కృషి చేసాడని, ఆలయ నిర్వహణకు 83 ఎకరాల భూమిని కూడా కానుకగా ఇవ్వడం జరిగిందని కధనం. ఇంకా ఎన్నో ఉపకథలు స్వామివారి మహిమను తెలుపుతాయి.. ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో అగ్రదర్శకుడు గా. రచయితా గా వెలుగొందుతున్న భీమవరం వాసి 'త్రివిక్రమ్ శ్రీనివాస్' కూడా స్వామివారి పరమ భక్తుడే.. ప్రస్తుతం స్వామి  వారికీ ఇక్కడ పాంచరాత్ర ఆగమనం ప్రకారం పూజలు నిర్వహిస్తున్నారు.. ప్రస్తుతం ఆలయం రాష్ట్ర  దేవాదాయ , ధర్మ దాయ సేఖా (ఇఓ .. నల్లం సూర్యచక్రధర రావు ) ఆధ్వర్యంలో , అడ్డాల వెంకట గణపతి రాజు అడ్జక్షతన మరో 8 మంది సభ్యులతో ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కలిపిస్తూ నిర్వహణ జరుగుతుంది. ఇక్కడ తిరుమల మాదిరి భక్తులు తల నీలాలు సమర్పించేందుకు ఏర్పాట్లు కూడా ఉన్నాయి.  సుందర మనోహర మైన  నిర్మాణం , 20 అడుగుల  అన్నమయ్య విగ్రహంతో  పాటు భక్తుల కు ప్రశాంత మైన వాతావరణంలో కాళ్ళకూరు శ్రీ వేంకటేశ్వరుడు భక్తులను అనుగ్రహిస్తునాడు.. వివరాలకు  ఫోన్ నెంబర్.. 08816- 245341.. నమో శ్రీ వెంకటేశాయ! 

 
 

Related Stories