తాజా వార్తలు   టీడీపీ నేత పట్టాభికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు | భీమవరం,పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాలలో | భీమవరంలో డ్వాక్రా మహిళలకు మహిళా సాధికారత ఫై సదస్సు | రఘురామాఫై విజయసాయి పిర్యాదుకు RBI స్వాందన.. | ఏపీ సిఎం ను బూతులు తిడతమేమిటి? కేటీఆర్ ఆగ్రహం | రాధేశ్యామ్‌..టీజర్ విడుదల..భీమవరంలో ప్రభాస్ పుట్టిన రోజు హంగామా | ప్రపంచం చుసేవిధముగా బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ | భీమవరం, 2వ రోజు జనాగ్రహదీక్షలో గ్రంధి సంచలన వ్యాఖ్యలు | 100 కోట్ల వ్యాక్సిన్ల పంపిణీ భారతీయ విజయం..మోడీ | 2 వ రోజు దీక్షలో చంద్రబాబు..హెచ్చరికలు,విశేషాలు |

తిరుమల వివాదాలు ఆగేదెప్పుడు? విచారణ లేదా?

Updated: May 28, 2018

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: తాజగా చినికి చినికి గాలివానగా మారినట్లు, ఏ  ముహూర్తాన  ముఖ్యమంత్రి చంద్రబాబు  తిరుమల తిరుపతి దేవస్థానం కు కొత్త  బోర్డు సభ్యుల నియామకం కు సిద్దపడ్డారో కానీ అప్పటి నుండి ఆయన టీటీడీ వివాదాలకు కేంద్ర బిందువు కావడం ఊహించని సమస్యలు ను ఎదుర్కోవాల్సి రావడం గమనించదగింది. .టిటిడి బోర్డు ను చంద్రబాబు నాయుడు వేసినప్పుడు అందులో కొందరు క్రైస్తవ మత ప్రచారానికి వెళ్లారని ఆరోపణలు వచ్చాయి. ఎం ఎల్ ఏ  అనిత అయితే తాను క్రిస్టియన్ అని ,బైబిల్ లేకుండా బయటకు వెళ్లనని చెప్పిన వీడియో ఆమె నైజాన్ని బట్టబయలు చేసింది. తప్పని పరిస్థితులలో ఆమె  కన్నీటితో. పదవిని వదులుకోవలసి వచ్చింది.  ఆ తర్వాత టి టి డి చైర్మెన్ ఎంపిక కూడా వివాదాన్ని రేపిన తదుపరి సద్దుకుంది. ఇక తదుపరి ప్రధాన దేవాలయ అర్చకుడు రమణ దీక్షితుల వివాదం మాత్రం అనేక లొసుగులను  ప్రశ్నించడం తో పాటు ముఖ్యమంత్రి  చంద్రబాబు ను, రాష్ట్ర మంత్రులను ఇరుకున పెట్టారు. దీని ప్రభావం ప్రభుత్వం తో పాటు  బ్రాహ్మణ సమాజాన్ని కుదిపివేసిందని చెప్పాలి.ఏకంగా  రాష్ట్ర ప్రభుత్వానికి , బ్రాహ్మణులకు మద్య అగాదం పెంచిందని  భావించాలి. కలియుగ వైకుంఠంగా  నిత్యం లక్షల మంది సందర్శించుకునే శ్రీహరి  శ్రీ వెంకటేశ్వరుడు కు రాజకీయ కారణాలతో  వి ఐ పిల  దర్శనాలతో శ్రీవారికి  ఆగమన శాస్త్రం ప్రకారం , కైంకర్యాల కానీ , నైవేద్య  సమర్పణలు , సేవలు సజావుగా చేయలేకపోతున్నామని స్వయంగా ప్రధాన  అర్చకుడు  రమణ దీక్షితులు ఆరోపించడం సంచలనం రేపింది. హిందూ భక్తులకు  మనోవేదన కలిగించింది. అంతే కాదు అలాగే శ్రీవారి ఆభరణాలు, గులాబీ రంగు వజ్రం  గల్లంతయ్యాయన్న ఆరోపణ తో  రమణదీక్షితులు దేశ  వ్యాప్తంగా ఉన్న హిందువులను ఆలోచింపచేసారు. అతని ఆరోపణలపై వెంటనే విచారించడం మాని  వెంటనే  వారసత్వంగా ఉన్న ఆయన అర్చక పదవిని  తొలగిస్తూ  బోర్డు దూకుడుగా  చేసిన ఆదేశాలు  మరింత చర్చకు దారితీసాయి. రమణ దీక్షితులు ఏకంగా కేంద్ర హోం శాఖ వరకు వెళ్లి పిర్యాదు చేశారంటే చిన్న విషయంగా తీసుకోవడానికి లేదు. గతంలో ఒక కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను ఆయన ప్రస్తావిస్తున్నారు. స్వామి వారి పైఉన్న ఒక ఆభరణంలోని వజ్రం భక్తులు విసిరే నాణాల వల్ల పగిలిపోయిందని పేర్కొన్న విషయాన్ని ఆయన చూపించి అదెలా సాధ్యమని అడుగుతున్నారు.అదే సమయంలో టిటిడి చైర్మన్ సుధాకర్ యాదవ్ కాని, ఇ.ఓ. సింఘాల్ కాని అసలు అది వజ్రమే కాదని, లేనిదానిని ఎక్కడ నుంచి తేవాలని  ప్రశ్నిస్తున్నారు. తాజాగా  మంత్రి  సోమిరెడ్డి  ముందువెనుక చూడకుండా  రమణ దీక్షితులు ఆరోపణలపై సమాధానం చెప్పకుండా ఆయనను అవమానకరంగా మాట్లాడి రగులుతున్న అగ్నికి ఆజ్యం పోశారు. దీనితో బీజేపీ వర్గాలు ,,  రాష్ట్రంలో కరడుగట్టిన కులస్వామ్య పార్టీ పాలన సాగుతోందని విమర్శలు మొదలు పెట్టారు. బ్రాహ్మణుల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. బ్రాహ్మణ వేదిక పేరుతో ఆ వర్గం వారు సమావేశం అయి చంద్రబాబు బ్రాహ్మణులను అవమానిస్తున్నారని ఆరో్పించారు.తదుపరి సోమిరెడ్డి  పరిణామాలు అర్ధం చేసుకొని  దీక్షితులు క్షమాపణలు చెప్పడం ఒక మంచి పరిణామం   ఇదంతా చంద్రబాబు కు తెలిసే జరుగుతుందని అనలేం కానీ , ఆరోపణలపై వెంటనే స్వాందించి  విచారణకు  స్వయంగా  ఆదేశించి తమ తప్పులు ఉంటె సరిదిదుకోవలసిన బాధ్యత, మంత్రుల పరుష  మాటలను అదుపులో పెట్టవలసిన బాధ్యత చంద్రబాబు కు  కచ్చితంగా ఉంది.. రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పకపోయిన.. ప్రత్యక్ష నారాయణుడికి వాస్తవాలు చెప్పాలి.. దీక్షితులయినా ? చంద్రబాబు అయినా ?  .. సిగ్మా ప్రసాద్ కాలమ్స్  www.sigmatelugu.com

 

 
 

Related Stories