తాజా వార్తలు   ఏపీలో గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరీక్షలు | టీడీపీ నేత పట్టాభికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు | భీమవరం,పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాలలో | భీమవరంలో డ్వాక్రా మహిళలకు మహిళా సాధికారత ఫై సదస్సు | రఘురామాఫై విజయసాయి పిర్యాదుకు RBI స్వాందన.. | ఏపీ సిఎం ను బూతులు తిడతమేమిటి? కేటీఆర్ ఆగ్రహం | రాధేశ్యామ్‌..టీజర్ విడుదల..భీమవరంలో ప్రభాస్ పుట్టిన రోజు హంగామా | ప్రపంచం చుసేవిధముగా బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ | భీమవరం, 2వ రోజు జనాగ్రహదీక్షలో గ్రంధి సంచలన వ్యాఖ్యలు | 100 కోట్ల వ్యాక్సిన్ల పంపిణీ భారతీయ విజయం..మోడీ |

అరకు ఘాతుకంచేసిన నక్సల్ కోసం భీమవరంలో గాలింపు.

Updated: October 6, 2018

సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: 28-9-2018 ఇటీవల ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన  అరకు ఎం ఎల్ ఏ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎం ఎల్ ఏ, సివేరి సోమలను కాల్చి చంపిన సాయుధ మావోయిస్టుల్లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన చిరునామాతో ఉన్న ఓ యువతి చిత్రాన్ని విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ విడుదల చేశారు. కాల్పుల్లో కీలకంగా వ్యవహరించిన కామేశ్వరి, స్వరూప, సింద్రీ, చంద్రి, రింకీ తదితర పేర్లతో పిలిచే యువతి భీమవరం పట్టణానికి చెందినట్లుగా గుర్తించిన విషయం విదితమే. ఆమె సమాచారం సేకరించే పనిలో ఉన్న పోలీసు శాఖకు  భీమవరం అంటే ఇదేనా.. వేరొక జిల్లాలోని భీమవరమా ?అనే కోణాల్లో కూడా దర్యాప్తు చేసినట్లు .నక్సలస్ పట్టణాలలో ఎవరికీ అనుమానం రాకుండా తిరుగుతారు కనుక ఆమెది భీమవరం పట్టణ  ప్రాంతం అయి ఉంటుందని భావిస్తున్నారు. 
గతంలో ఒక మహిళా మావోయిస్టు ఎన్‌కౌంటర్లో మృతి చెందారు. ఆమె కూడా భీమవరం పట్టణానికి  చెందిన మహిళా కండక్టర్‌గా అనుమానం వ్యక్తం చేయడంతో అప్పట్లో సంబంధిత డిపోలో అధికారుల నుంచి పోలీసులు సమాచారం సేకరించారు. అదే తరహాలో పోలీసులు మరోసారి డిపోలో వివరాలు మంగళవారం  సేకరించారని వార్త కధనం ... కామేశ్వరి అనే స్వరూప ఎప్పుడైనా విధుల్లో పాల్గొందా? ఆ పేరుకు దగ్గరగా ఉన్న వారు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో ఆరా తీశారు.2012లో ఒక యువతి కండక్టర్‌గా విధుల్లోకి చేరి మూడు నెలలు మాత్రమే పనిచేశారు. తర్వాత తూర్పుగోదావరి జిల్లా గోకవరం వెళ్లిపోయి అక్కడ్నుంచి మావోయిస్టుల్లో చేరిందనే సమాచారం తెలిసింది.ఇంకోవైపు,ఆమె భీమవరం పరిసరాల్లో చదివి ఉంటుందేమోననే కోణంలో విద్యాసంస్థల్లో సమాచారం కోసం పోలీసుశాఖ పయత్నిస్తున్నట్లు తెలిసింది.అలాగే కొన్నేళ్ల కిందట భీమవరం పట్టణానికి చెందిన యువకుడితో వివాహమై, ఇద్దరి మధ్య విభేదాల కారణంగా వెళ్లిపోయిందనే వాదన ఉంది. ఆ యువతిని చేసుకున్న యువకుడు ఎవరై ఉంటారో అని సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.స్వరూప కోసం స్వరూప కోసం,నేడు బుధవారం తెల్లవారుజాము భీమవరంలోని ఇందిరమ్మకాలనీలో పోలీసులు ఇంటింటా ఆకస్మిక తనిఖీ చేపట్టారు.  స్థానికుల ధ్రువపత్రాలు పరిశీలించి.. అనుమానితులను ప్రశ్నించారు
 
 

Related Stories